రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 22,670 మంది నమూనాలు పరీక్షించగా 1916 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 8 కేసులు ఉండగా.. రాష్ట్రంలో 1908 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 33,019 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో 43 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో కొత్తగా 1,916 కరోనా కేసులు.. ఒక్క రోజులోనే 43 మరణాలు - corona updates
![రాష్ట్రంలో కొత్తగా 1,916 కరోనా కేసులు.. ఒక్క రోజులోనే 43 మరణాలు corona positive cases conformed in ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8019727-606-8019727-1594715076010.jpg)
13:40 July 14
రాష్ట్రంలో కొత్తగా 1,916 కరోనా కేసులు.. ఒక్క రోజులోనే 43 మరణాలు
అనంతపురంలో 10, పశ్చిమగోదావరి జిల్లాలో 9, చిత్తూరులో 5, తూర్పుగోదావరిలో 5, కడపలో 5, కర్నూలు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 408కి చేరింది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 17,467కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 15,144 మంది చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి:
ఫార్మా కంపెనీలో వరుస ప్రమాదాలు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం