కరోనా రెండో దశ తెలంగాణను చుట్టుముట్టేస్తోంది. మొదటి దశ కన్నా వేగంగా విస్తరిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. రోజురోజుకూ కొవిడ్ వ్యాప్తి మరింత పెరుగుతోంది. 2 వేలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 1,914 మంది కొవిడ్ బారిన పడగా.. వైరస్ సోకి ఐదుగురు మృతి చెందారు. ప్రస్తుతం 11,617 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 11 వేలు కరోనా క్రియాశీలక కేసులు దాటాయి. 6,634 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. మరో 285 మంది కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 393 మంది కొవిడ్ బారినపడ్డారు.
తెలంగాణలో కొత్తగా 1,914 కరోనా కేసులు.. ఐదుగురు మృతి - corona cases total
తెలంగాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా 1,914 మంది కొవిడ్ బారిన పడగా.. వైరస్ సోకి మరో ఐదుగురు మృతి చెందారు.
telangana corona cases