ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 1078 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

తెలంగాణలో మళ్లీ కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. తాజాగా మరో 1078 మంది వైరస్ బారిన పడ్డారు. ఫలితంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,10,819 ‬కి చేరింది.

corona virus
telangana corona cases

By

Published : Apr 3, 2021, 10:24 AM IST

తెలంగాణలో కరోనా రెండో దశ వ్యాప్తి పెరుగుతోంది. మార్చి ఒకటో తేదీకి రాష్ట్రంలో కేవలం 1,907 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. నేటికి వాటి సంఖ్య 6,900కు పెరిగాయి. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతికి క్రియాశీల కేసులే నిదర్శంగా నిలుస్తున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 1,078 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఈ కేసులతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 310,819‬కి చేరింది. తాజాగా 331 మంది కోలుకోగా... ఇప్పటి వరకు 302,207‬మంది కోలుకున్నారు.

తాజాగా ఆరుగురు బలి

మరో ఆరుగురిని మహమ్మారి బలితీసుకోగా... మొత్తం మరణాలు 1,682కు పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 6,900యాక్టివ్ కేసులు ఉండగా అందులో 3,116 మంది ఐసోలేషన్​లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 283 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీతో పాటు పలు జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో నిన్న 59,705మందికి కొవిడ్ పరీక్షలు చేశారు.

సుమారు 47 శాతం వారికే..

కరోనా బారిన పడుతున్న వారిలో సుమారు 47 శాతం మంది 20 నుంచి 40 ఏళ్ల మధ్య వారే కావటం గమనార్హం. మహమ్మారి సోకిన వారిలో ఇటీవల చాలా స్వల్పంగానే లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఏ మాత్రం కరోనా సిప్టమ్స్ ఉన్నా.. తక్షణం పరీక్షలు చేయించుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. ఫలితంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని విన్నవిస్తోంది.

ఇదీ చూడండి:

ఆటగాళ్ల లాగే నేను ఫామ్​లో ఉన్నా: నితిన్ మేనన్

ABOUT THE AUTHOR

...view details