రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 18 వేల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,15,275 శాంపిల్స్ పరీక్షించగా.. 18,972 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. 71మంది మరణించారు.
రాష్ట్రంలో కొత్తగా 18,972 కరోనా కేసులు, 71 మరణాలు - ap corona cases
corona cases in ap
18:40 May 03
corona cases in ap
రాష్ట్రవ్యాప్తంగా తాజాగా 10,227 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా 9 మంది చొప్పున కొవిడ్‌తో మృతి చెందారు. అలాగే, అనంతపురం, కర్నూలులో ఏడుగురు చొప్పున ప్రాణాలు కోల్పోగా.. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు.
ఇదీ చదవండి
Last Updated : May 3, 2021, 7:13 PM IST