ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: కొత్తగా 1896 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. హైదరాబాద్‌తోపాటు.. జిల్లాల్లోనూ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్తగా 1896 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 82వేల 647కు చేరింది.

telangana
telangana

By

Published : Aug 11, 2020, 3:14 PM IST

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం(10వ తేదీన) కొత్తగా 1,896 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 82,647కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. సోమవారం ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 645కి చేరింది.

కరోనా బారి నుంచి నిన్న 1,788 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 59,374కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 22,628కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. సోమవారం రాష్ట్రంలో 18,035 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 6,42,875కి చేరింది.

కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 338, రంగారెడ్డిలో 147, కరీంనగర్ 121, మేడ్చల్‌ 119, వరంగల్‌ అర్బన్‌ 95, జనగామ 71, పెద్దపల్లి 66, ఖమ్మం జిల్లాలో 65, సిద్దిపేట 64 ఉన్నాయి.

ఇదీ చదవండి

రష్యా 'కరోనా వ్యాక్సిన్​' విడుదల

ABOUT THE AUTHOR

...view details