Corona Cases in Andhra Pradesh: రాష్ట్రంలో కొత్తగా 184 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 204 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,008 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 30,747 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
India Covid cases: మరోవైపు దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 6,822 మందికి వైరస్ సోకినట్లు తేలింది. రోజువారీ కేసుల సంఖ్య 558 రోజుల కనిష్ఠానికి చేరింది.
- మొత్తం కేసులు: 3,46,48,383
- మరణాలు: 4,73,757
- యాక్టివ్ కేసులు: 95,014
- కోలుకున్నవారు: 3,40,79,612
Vaccination in India:
దేశంలో టీకా పంపిణీ వేగంగానే కొనసాగుతోంది. మరో 79,39,038 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,28,76,10,590కు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా..
- అమెరికా, బ్రిటన్, జర్మనీ సహా వివిధ దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. అన్ని దేశాల్లో కలిపి 24 గంటల వ్యవధిలో 4,47,937 కేసులు నమోదయ్యాయి. 5,392 మంది మరణించారు.
- అమెరికాలో 88 వేలకు పైగా కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 627 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రిటన్‌లో 51 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 41 మంది మరణించారు.
- జర్మనీలో 39,330 కేసులు నమోదు కాగా.. 309 మంది వైరస్ తీవ్రతకు ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజే 1,184 మంది వైరస్‌కు బలయ్యారు. 32 వేల మందికి తాజాగా కొవిడ్ సోకినట్లు తేలింది.
ఇదీ చదవండి:17మంది బాలికలపై ప్రిన్సిపల్ లైంగిక దాడి.. భోజనంలో మందు కలిపి...