ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రికార్డుస్థాయిలో కేసులు... 300 దాటిన మరణాలు - today corona cases in ap

రాష్ట్రంలో కొత్తగా 1813 కరోనా కేసులు..17 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 1813 కరోనా కేసులు..17 మరణాలు

By

Published : Jul 11, 2020, 4:52 PM IST

Updated : Jul 12, 2020, 2:43 AM IST

15:56 July 11

రాష్ట్రంలో కొత్తగా 1813 కరోనా కేసులు..17 మరణాలు

హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు, మరణాల రేటు రోజురోజుకూ పెరిగిపోతోంది.  రికార్డు స్థాయిలో ఒక్కరోజే  1813 మందికి వైరస్‌ సోకింది. రెండు జిల్లాల్లో 300కు పైగా కేసులు నమోదు కాగా.. మరో రెండు జిల్లాల్లో 200కుపైగా కేసులు నిర్ధరణ అయ్యాయి. మొత్తం కేసులు సంఖ్య  27,235కు ఎగబాకింది. కరోనా బారినపడి మృతిచెందుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకూ  పెరుగుతోంది. ఒక్కరోజే 17 మంది ప్రాణాలు కోల్పోగా...రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 300 దాటిసేంది. వైరస్‌ విస్తృత వ్యాప్తి దృష్ట్యా జనం మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

తుని ఎమ్మెల్యే హోం క్వారంటైన్ 

గుంటూరు జిల్లాలో కొత్తగా 155 కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 3571కు ఎగబాకింది. కొత్త  కేసుల్లో గుంటూరు నగరంలోనే 49 ఉన్నాయి.  మంగళగిరిలో 43, నరసరావుపేటలో 21, తాడేపల్లిలో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాడికొండ నియోజకవర్గంలో ముగ్గురు కరోనా బారినపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 143 కేసులు వెలుగుచూశాయి. కేసులు పెరుగుతున్నదృష్ట్యా కొత్తపేట నియోజకవర్గంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే  వ్యాపారులు దుకాణాలు తెరుస్తున్నారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా 2 వారాల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్​ నుంచి వచ్చిన వారికి కరోనా

విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం సూదివలస గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్​కు కరోనా సోకింది. దేవరాపల్లి మండలం వేచలం, బోయలకింతాడ గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులకు పాజిటివ్‌ వచ్చింది.  విశాఖ మన్యంలో కరోనా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాడేరు మండలం దొడ్డిపల్లికి హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా సోకింది. చోడవరం మండలంలోని గవరవరంలో స్వచ్ఛంద లాక్​డౌన్ విధించుకున్నారు. విజయనగరం జిల్లా  ఈతమానలో శుక్రవారం ఒకరికి కరోనా సోకగా..రోగి కుటుంబ సభ్యులతో పాటు మరికొందరికి పరీక్షలు చేశారు.

ఆర్మీ ఉద్యోగులు ఆందోళన

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం గోవిందపురంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఒక యువతి శ్రీకాకుళంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. శవపరీక్షల్లో ఆమెకు కరోవా పాజిటివ్‌ వచ్చింది.  యువతి అంత్యక్రియల్లో పాల్గొన్న 70 మందిని క్వారంటైన్‌కు తరలించారు. పాలకొండలో  ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. సంతబొమ్మాళి మండలం లక్ష్మీపురం క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్న 80 మంది ఆర్మీ ఉద్యోగులు ఇళ్లకు పంపాలంటూ నిరసన వ్యక్తం చేశారు.  కరోనా పరీక్షలు జరిపినా ఫలితాలు వెల్లడించకుండా ఇంకా కేంద్రంలోనే ఉంచేశారని ఆవేదన వ్యక్తంచేశారు. క్వారంటైన్‌ కేంద్రంలో వసతులపై పెదవి విరిచారు.

అవగాహన ర్యాలీ

కడప జిల్లా ప్రొద్దుటూరులో  మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది.  రాయచోటిలో ఇప్పటికే  నలుగురు  కరోనా బారిన పడగా కొత్తగా మరో ఇద్దరు వ్యాపారులకు వైరస్‌ సోకింది. సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసులు వాహన ర్యాలీ  నిర్వహించి ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు.  ప్రకాశం జిల్లా అద్దంకిలో  ఒక వైద్యునికి, మరో ముగ్గురికి కరోనా సోకగా అధికారులు అప్రమత్తమయ్యారు 14 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు దుకాణాలకు అనుమతి ఉంటుందని తెలిపారు.

ఇదీ చదవండి :

అజాగ్రత్త వల్లే.. ఆ కుటుంబంలో 25 మందికి కరోనా

Last Updated : Jul 12, 2020, 2:43 AM IST

ABOUT THE AUTHOR

...view details