జీహెచ్ఎం ఎన్నికల పోలింగ్ నెమ్మదిగా సాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 3.96 శాతం నమోదు కాగా... 11 గంటల వరకు 8.9 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 18.20 శాతం నమోదు అయింది.
గ్రేటర్ పోరు: ఒంటిగంట వరకు 18.20 శాతం పోలింగ్ నమోదు - హైదరాబాద్ పౌర ఎన్నికలు
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఒంటిగంట వరకు 18.20 శాతం పోలింగ్ నమోదైంది.
per-cent
ఓటు హక్కు వినియోగించుకోవడానికి భాగ్యనగర ఓటర్లు ఆసక్తి చూపడం లేనట్టు కనిపిస్తోంది. ఉదయం ఏడింటికి ప్రారంభమైన పోలింగ్... సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 150 డివిజన్లలో.. 11 వందల22 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.