ap corona cases: కొత్తగా 1,747 కరోనా కేసులు,14 మరణాలు - corona death toll in andhrapradesh
16:38 July 23
today ap corona cases
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 65,920 పరీక్షలు నిర్వహించగా.. 1,747 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,50,339 మంది వైరస్ బారినపడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 13,223కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,365 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,14,177కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,939 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,39,75,283 నమూనాలను పరీక్షించారు.
ఇదీ చదవండి