రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 46,852 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 173 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,86,418కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.
రాష్ట్రంలో కొత్తగా 173 కరోనా కేసులు.. తగ్గిన మరణాలు - covid-19
రాష్ట్రంలో కొత్తగా మరో 173 మందికి కరోనా సోకింది. 24 గంటల వ్యవధిలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని.. వైద్యారోగ్య శాఖ బులెటిన్లో పేర్కొంది.
![రాష్ట్రంలో కొత్తగా 173 కరోనా కేసులు.. తగ్గిన మరణాలు 173 new corona positive cases registered in the state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10314210-943-10314210-1611146728448.jpg)
రాష్ట్రంలో కొత్తగా 173 కరోనా కేసులు.. తగ్గిన మరణాలు
శుక్రవారం(20.1.21) వరకు మొత్తం మరణాల సంఖ్య 7,142గా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 196 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. వీరితో కలిపి రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8.77 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,713 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చదవండి:ప్రేమ..పెళ్లి.. హత్య.. ఆత్మహత్య...