ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో మరో 1,724 కరోనా కేసులు, 10 మంది మృతి - తెలంగాణలో కరోనా కొత్త కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. తాజాగా 1,724 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 97,424కి చేరింది.

covid 19 new cases in telangana
తెలంగాణలో మరో 1,724 కరోనా కేసులు, 10 మంది మృతి

By

Published : Aug 20, 2020, 11:07 AM IST

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం(19వ తేదీన) కొత్తగా మరో 1,724 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 97,424కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. బుధవారం ఒక్కరోజే కరోనాతో మరో 10 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 729కి చేరింది. తాజాగా 1,195 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 75,186కి చేరిందని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 395 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 169, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 105, కరీంనగర్​ జిల్లాలో 101, వరంగల్ అర్బన్‌ జిల్లాలో 91, సిద్దిపేట జిల్లాలో 61 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

ఇదీ చూడండి :హైదరాబాద్​లో 6.6 లక్షల మందికి కరోనా!

ABOUT THE AUTHOR

...view details