రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే.. ఇవాళ కొవిడ్ కేసుల సంఖ్య కొంతమేర తగ్గింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,00,424 పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 17,188 కేసులు నిర్ధరణ కాగా.. 73 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,86,695 కొవిడ్ క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
రాష్ట్రంలో కొత్తగా 17,188 కరోనా కేసులు, 73 మరణాలు - today corona cases in andhrapradesh news
![రాష్ట్రంలో కొత్తగా 17,188 కరోనా కేసులు, 73 మరణాలు corona cases in andhrapradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11676611-90-11676611-1620394838779.jpg)
ఏపీలో కరోనా కేసులు
18:08 May 07
ap corona cases
జిల్లాల వారీగా మరణాలు
గత 24 గంటల వ్యవధిలో విజయనగరంలో అత్యధికంగా 11 మంది మృత్యవాత పడ్డారు. విశాఖలో 10, తూర్పుగోదావరి-8, చిత్తూరు- 7, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఆరుగురు చొప్పున మృతి చెందారు. పశ్చిమగోదావరి, ప్రకాశం, కర్నూలు జిల్లాలో ఐదుగురు చొప్పున.. నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పు ప్రాణాలు కోల్పోయారు. వైరస్ బారిన పడి అనంతపురం జిల్లాలో మరో ఇద్దరు మృతి చెందారు.
ఇదీ చదవండి:
Last Updated : May 7, 2021, 7:30 PM IST