తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. తాజాగా మరో 169 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి సోకి ఒకరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు 2,95,270 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు 1,607 మంది మృతి చెందారు. మహమ్మారి నుంచి తాజా 189 మంది కోలుకోగా.. ఇప్పటివరకు వైరస్ బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,91,699కి చేరింది.
తెలంగాణ: 2 లక్షల 95 వేలు దాటిన కరోనా బాధితులు - Telangana News Updates
తెలంగాణలో కరోనా ఉద్ధృతి నెమ్మదిగా తగ్గుతోంది. రాష్ట్రంలో తాజాగా మరో 169 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. కరోనాతో ఇప్పటివరకు 1,607 మంది మృతి చెందారు.
తెలంగాణలో 2 లక్షల 95 వేలు దాటిన కరోనా బాధితులు
రాష్ట్రంలో ప్రస్తుతం 1,964 కరోనా యాక్టివ్ కేసులుండగా.. 780 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 31 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.