ap corona cases: రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 24,219 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 165 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల నెల్లూరులో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. వైరస్ బారి నుంచి తాజాగా 130 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,260 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
భారీగా కరోనా కేసులు..
India covid cases: దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 27,553 కేసులు వెలుగుచూశాయి. మరో 284 మంది ప్రాణాలు కోల్పోయారు. 9,249 మంది కోలుకున్నారు. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,525 కి చేరడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
- మొత్తం కేసులు: 3,48,89,132
- మొత్తం మరణాలు: 4,81,770
- యాక్టివ్ కేసులు: 1,22,801
- కోలుకున్నవారు: 3,42,84,561
omicron cases in india
దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 1,525కి పెరిగింది. వారిలో 560 మంది కోలుకున్నారు. దేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ విస్తరించింది.
- మహారాష్ట్ర- 460
- దిల్లీ- 351
- గుజరాత్- 136
- తమిళనాడు- 117
- కేరళ- 109
Vaccination in Indiaదేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. శనివారం మరో 25,75,225 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,45,44,13,005 కు చేరింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు..
Worldwide covid cases today:ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 11 లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 3,875 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో 2.19 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 110 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1,23,851కు చేరింది.
- బ్రిటన్‌లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా లక్షా 62 వేల కేసులు నమోదయ్యాయి. 154 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు.
- అమెరికాలో కొత్తగా 1.61 లక్షల కేసులు నమోదయ్యాయి. 257 మంది ప్రాణలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 8.46లక్షలకు చేరింది.
- ఇటలీలో 1.41 లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 111 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 62,66,939 కు పెరిగింది. మరణాల సంఖ్య 1,37,513కు చేరుకుంది.
- టర్కీలో కొత్తగా 36 వేల కేసులు నమోదు అయ్యాయి. 145 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి
సముద్రంలో స్నానానికి దిగి ఐదుగురు గల్లంతు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం!