రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు.. - 1,601 new corona cases registered in andhrapradesh
17:13 August 25
ap corona case
రాష్ట్రంలో కొత్తగా 1601 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 58 వేల 890 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. వైరస్ ప్రభావంతో మరో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్‌తో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందగా... తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, పశ్చిమగోదావరి, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకరు చొప్పున చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి 1715 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం 13వేల 677 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి:CM JAGAN: 'కొవిడ్ మార్గదర్శకాలు పాటించకపోతే కఠిన చర్యలు'
TAGGED:
corona case