ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షలు 90 లక్షల మార్క్ దాటింది. ఇప్పటివరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ 90,21,225 శాంపుల్స్‌ని పరీక్షించగా 8,51,298 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 80,737 నమూనాలను పరీక్షించగా 1,593 మందికి కొవిడ్ నిర్ధారణ అయినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలో 10 మంది బాధితులు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,847కి చేరింది. గడిచిన 24 గంటల్లో 2,178 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 8,24,189 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,262 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కృష్ణాలో ముగ్గురు, విశాఖలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో 90లక్షలు దాటిన కరోనా పరీక్షలు - ఏపీలో కరోనాకేసులు
రాష్ట్రంలో కొత్తగా 1,593 కరోనా కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. వైరస్‌తో 10 మంది మృతి చెందారు. ఏపీలో కరోనా పరీక్షలు 90 లక్షల మార్క్ దాటింది.
రాష్ట్రంలో కొత్తగా 1,593 కరోనా కేసులు