తెలంగాణలో సోమవారం మరో 1550 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 9 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 926 కేసులను గుర్తించారు. మొత్తంగా కొవిడ్ పాజిటివ్ కేసులు 36,221కి చేరుకున్నాయి.
తెలంగాణలో కొత్తగా 1,550 కరోనా కేసులు నమోదు - హైదరాబాద్ కరోనా తాజా వార్తలు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొత్తగా ఆ రాష్ట్రంలో 1550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
1550 new corona cases in Telangana, 9 deaths recorded in the state
ఇప్పటివరకు కరోనాతో మొత్తం 365 మంది మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి కోలుకుని 1,197 మంది ఇంటికెళ్లారు.ప్రస్తుతం 12,178 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మొత్తం మీద 23,679 మంది డిశ్చార్జయ్యారు.
ఇదీ చూడండి :ఎంసెట్ సహా...పలు ప్రవేశ పరీక్షలు వాయిదా: మంత్రి సురేశ్