AP CORONA: రాష్ట్రంలో 1,546 కరోనా కేసులు..15మరణాలు - ఏపీ కరోనా కేసులు
17:15 August 02
రాష్ట్రంలో 1,546 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 15 వందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో 59,641 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1546మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 19,70008కు చేరింది. మరోవైపు 1968మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 19,36016 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
తాజాగా కరోనాతో పోరాడుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతూ 15 మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృతి చెందగా, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురేసి, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 13,410కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,582 యాక్టివ్ కేసులున్నాయి.