ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పాఠశాలలో కరోనా కలకలం.. 15 మంది విద్యార్థులకు సోకిన వైరస్ - మంచిర్యాల పాఠశాలలో కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలోని బాలికల ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. పాఠశాలకు చెందిన మరో 15 మందికి పాజిటివ్​గా నిర్థరణ అయ్యింది.

15 students tested positive
పాఠశాలలో కరోనా కలకలం.. మరో 15 మంది విద్యార్థులకు సోకిన వైరస్

By

Published : Mar 16, 2021, 4:04 PM IST

తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలోని బాలికల ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. పాఠశాలకు చెందిన మరో 15 మందికి పాజిటివ్​ అని తేలింది. 80 మందికి పరీక్షలు చేయగా 15 మంది బాలికలకు వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది.

అదే పాఠశాలలో సోమవారం నిర్వహించిన పరీక్షల్లో 14 మందికి పాజిటివ్ అని తేలింది. వారిలో 11 మంది టీచర్లు, ఇద్దరు వంట నిర్వాహకులు, ఒక విద్యార్థి ఉన్నారు. పాఠశాలలో ఇప్పటివరకు 29 మందిలో వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కలకలం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను పాఠశాలలకు పంపించడానికి భయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details