అమరావతి కోసం.. 13వ రోజూ పోరాటానికి సిద్ధం - అమరావతి కోసం.. 13వ రోజూ ఆగని పోరుబాట
రాజధాని రగులుతోంది. ప్రభుత్వం తీరు.. రైతుల్లో ఆగ్రహం పెంచుతోంది. 13వ రోజూ.. అమరావతి పరిధిలోని రైతాంగంతో పాటు.. ప్రజానీకం ఆందోళనకు సిద్ధమైంది.
![అమరావతి కోసం.. 13వ రోజూ పోరాటానికి సిద్ధం 13th day protest for capital in amaravathi region](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5535014-1095-5535014-1577672155811.jpg)
అమరావతి కోసం.. రాజధాని రైతుల పోరాటం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. 12 రోజులు గడిచినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడం.. మంత్రుల నుంచి అయోమయ వ్యాఖ్యలు వినిపిస్తున్న కారణంగా.. రాజధాని అమరావతి పరిధిలోని రైతులు.. 13వ రోజూ ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే మందడం, తుళ్లూరులో మహా ధర్నాలకు సిద్ధమయ్యారు. వెలగపూడిలో 13వ రోజు రిలే నిరాహార దీక్ష చేయనున్నారు. ఎర్రబాలెం, నీరుకొండ గ్రామాల్లో వంటా-వార్పు.. కృష్ణాయపాలెం, నవులూరులో రిలే నిరాహార దీక్షలతో తమ నిరసన తెలపనున్నారు విజయవాడలో సివిల్ కోర్టు నుంచి హై కోర్టు వరకు ద్విచక్రవాహనాల ర్యాలీ చేయనున్నారు. ఈ ఆందోళనలకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు మద్దతుగా నిలవనున్నాయి.