AP Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 132 కరోనా కేసులు నమోదు కాగా కొవిడ్‌తో ఒకరు మృతి చెందారు. మహమ్మారి బారి నుంచి మరో 186 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,823 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 29,228 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
మరోవైపు దేశంలో మరో 5,784మంది పాజిటివ్‌గా తేలింది. మరో 252 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 7,995 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. సోమవారం 66,98,601 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,33,88,12,577కు చేరింది.