రాష్ట్రంలో విజయనగరం మినహా 12 జిల్లాల్లోని పంచాయతీల్లో తొలిదఫా ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. 12 జిల్లాలో 18 రెవెన్యూ డివిజన్లు 168 మండలాల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ జరుగుతోంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా(248), అత్యల్పంగా నెల్లూరు జిల్లా (27)లో నామినేషన్లు వేశారు.
1315 నామినేషన్లు...
తొలిరోజున 12 జిల్లాల్లోని పలు పంచాయతీల్లో మొత్తం 1315 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. శ్రీకాకుళం -141, విశాఖపట్నం-194,తూ.గో-248, పశ్చిమగోదావరి జిల్లా- 82, గుంటూరు-127,కృష్ణా-63 ,నెల్లూరు -27 నామినేషన్లు దాఖలయ్యాయి.ప్రకాశం జిల్లాలో 41, అనంతపురం-77, చిత్తూరు -157, కడప -73, కర్నూలు -85 నామినేషన్లు వేశారు.