రాష్ట్ర ప్రభుత్వం 13 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా డా.షీముషి, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్ దేవ్ శర్మ స్థానచనలం పొందారు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని నారాయణ్ నాయక్‌కు ఆదేశాలు అందాయి.
IPS Transfers: రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్‌ల బదిలీ - ips tranfer in ap updates

11:31 July 14
ఐపీఎస్‌ల బదిలీ
ఆక్టోపస్ ఎస్పీగా డా. కోయ ప్రవీణ్, ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్‌గా విక్రాంత్ పాటిల్, మంగళగిరి డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల ఏఐజీగా ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీగా మాలికా గార్గ్, విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్‌దేవ్ సింగ్, కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్‌గా గరుడ్ సుమిత్ సునీల్, విశాఖ డీసీపీ-1గా గౌతమీ శాలి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా వకుల్ జిందాల్, మంగళగిరి ఆరో బెటాలియన్ కమాండెంట్గా అజితా వేజెండ్ల బదిలీ అయ్యారు.
ఇదీ చదవండి: