రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 51,660 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 124 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు కొవిడ్‌తో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,546 కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,172 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రంలో కొత్తగా 124 కరోనా కేసులు.. ఒకరు మృతి - new corona cases in state news
రాష్ట్రంలో కొత్తగా 124 కరోనా కేసులు నమోదు కాగా.. ఒకరు మరణించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. 94 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 51,660 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని పేర్కొంది.
కరోనా కేసులు
ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 94 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,79,474కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 900 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక కోటి 41లక్షల 43వేల 911 కరోనా శాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.
ఇదీ చదవండి:మాచర్లలో పిచ్చి కుక్కల దాడి.. 8మంది చిన్నారులకు గాయాలు