Omicron Cases in Telangana: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 20కి చేరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు ఎట్ రిస్క్, నాన్ రిస్క్ దేశాల నుంచి 7,206 మంది ప్రయాణికులు రాష్ట్రానికి రాగా.. వారిలో 20 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో ముగ్గురి ఫలితాలు రావాల్సి ఉంది.
Omicron Cases in Telangana: తెలంగాణలో మరో 12 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు - తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు
Omicron Cases in Telangana
20:48 December 18
మొత్తం 20కి చేరిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు
corona cases in telangana: తెలంగాణలో గత 24 గంటల్లో 41,484 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 185 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,79,430కి చేరింది. నిన్న కరోనాతో ఒక్కరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 4,014కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 205 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,761 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదీ చదవండి
Last Updated : Dec 18, 2021, 9:08 PM IST