- భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి, 10 వేల దిగువకు కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 9,531 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 36 మంది కరోనాతో మరణించారు. 24 గంటల వ్యవధిలో 11,726 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.59 శాతం వద్ద ఉంది. యాక్టివ్ కేసులు 0.22 శాతం ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.15 శాతం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కుల జాడ్యాన్ని తరిమికొట్టాల్సిందే, యువత ముందుకు రావాలి
రాజస్థాన్‌లో తాగునీటి కుండను తాకినందుకు టీచర్ తీవ్రంగా కొట్టడంతో ఓ దళిత బాలుడు మృత్యువాతపడిన ఘటనపై ఆ రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుల వ్యవస్థ జాడ్యాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరముందని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఉద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బస్సు ఛార్జీల విషయంలో ఆర్టీసీ మాయాజాలం, ఎందుకో తెలుసా
ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వెబ్‌సైట్లో ఆర్టీసీ మాయాజాలం ప్రదర్శిస్తోంది. చార్జీల ధరల విషయంలో ప్రయాణికులను గందరగోళానికి గురి చేస్తోంది. ప్రైవేటు ట్రావెల్స్ కంటే తక్కువ టికెట్ ధర చూపించి వారికంటే ఎక్కువే బాదేస్తోంది. ఓక్కో సీటుపై వంద రూపాయలు ఆ పైనే బాదుడుతో ఆర్టీసీ బస్సు చార్జీ ధర ప్రైవేటు ట్రావెల్స్‌నూ మించిపోతోంది. ప్రభుత్వ రవాణా సంస్థలో ఈ తరహా విధానంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భర్తకు మత్తుమందు ఇచ్చి అంతమొందించిన భార్య, 59రోజుల తర్వాత వెలుగులోకి
కట్టుకున్న భార్యే భర్తను కడతేర్చి, సహజ మరణంగా చిత్రీకరించింది. కుటుంబసభ్యులు, బంధువులు అదే నిజమని నమ్మారు. తాము బయటపడ్డామని నిందితులు ఊపిరి పీల్చుకున్నారు. సెల్‌ఫోన్‌లోని సమాచారంతో మృతుడి తండ్రికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించగా, విచారణలో గుట్టు బయటపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మూడో ప్రత్యామ్నాయం ఉండాలన్న జనసేన అధినేత పవన్
రాష్ట్రంలోనూ మూడో ప్రత్యామ్నాయం ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వైకాపా, తెదేపాకు కొమ్ము కాసేందుకు తాము సిద్దంగా లేమని వెల్లడించారు. వైకాపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాకూడదనేదే తమ విధానమని చెప్పారు. సమయం వచ్చినప్పుడు ఎన్నికల వ్యూహం చెబుతానని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నేడు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ, పోలవరంపై చర్చించే అవకాశం