ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOPNEWS ప్రధానవార్తలు 11AM - 11AM ఆంధ్రప్రదేశ్​ టాప్​ న్యూస్​

.

11AM TOPNEWS
ప్రధానవార్తలు 11AM

By

Published : Aug 16, 2022, 10:58 AM IST

  • బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొని 20 మంది సజీవ దహనం

పాకిస్థాన్​లో జరిగిన ఘోర ప్రమాదంలో 20 మంది సజీవ దహనం అయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్ రాష్ట్రం ముల్తాన్​లో మంగళవారం జరిగిందీ దుర్ఘటన. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి, 9వేల దిగువకు కేసులు

భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. సోమవారం 14,917 కేసులు రాగా, తాజాగా 8,813 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. కరోనా కారణంగా మరో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.56 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.25 శాతానికి చేరాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వాజ్​పేయీకి రాష్ట్రపతి, ప్రధాని ఘన నివాళులు

దివంగత భాజపా అగ్రనేత, మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ నాలుగో వర్ధంతి సందర్భంగా ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​ఖడ్​, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, పలువురు ప్రముఖులు మాజీ ప్రధానికి పుష్పాంజలి ఘటించి స్మరించుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తేళ్లతో దేవుడికి నైవేద్యం పెట్టే వింత ఆచారం

ఎక్కడైనా దేవుడికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు. ఇంకా అయితే ప్రీతిపాత్రమైన పలహారాన్నివండి దేవుడికి నైవేద్యం పెడతారు. ఆ ప్రాంతంలో మాత్రం తేళ్లను పట్టుకుని నైవేద్యంగా సమర్పిస్తారు. పెద్దలే కాదు చిన్నపిల్లలు సైతం తేళ్లను భయంలేకుండా పట్టుకుంటారు. చూడటానికి వింతగా ఉన్నా.. ఈ ఆచారం మాత్రం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని 11 మందికి గాయాలు

రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని 11 మందికి గాయాలైన ఘటన నంద్యాల బైపాస్ రహదారిపై చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ, నంద్యాల డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

పోలీస్‌స్టేషన్‌లో తెదేపా నాయకుడికి గుండెపోటు

బాపట్ల జిల్లా గవినివారిపాలెంలో తమ పార్టీ ఫ్లెక్సీలు, తోరణాలు తొలగిస్తున్నారని అభ్యంతరం చెప్పిన ఇద్దరు తెదేపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్​కు తరలించగా..వారిలో ఒకరు గుండెపోటుకు గురయ్యారు. పోలీసులు విచారణ పేరుతో బెదిరించడంతోనే పార్టీ నేత నాగరాజు కుప్పకూలిపోయాడని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్వాతంత్య్ర దినోత్సవం వేళ 175 మంది ఖైదీలు విడుదల

క్షణికావేశం ఓ ఇంటి పెద్దను జీవిత ఖైదీని చేసింది. కుటుంబాన్ని రోడ్డుపాలు చేసింది. ఓ క్వార్టర్‌ మద్యం ఓ మాజీ సైనికుడిని 13 ఏళ్లు జైలు జీవితం అనుభవించేలా చేసింది. కోపంలో చేసిన ఓ చిన్న తప్పు ఓ మహిళను హంతకురాలిగా మార్చి తన పిల్లలకు దూరం చేసింది. ఇలా స్వాతంత్య్ర దినోత్సవం వేళ విడుదలైన 175 మంది ఖైదీల్లో ప్రతిఒక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • త్వరలోనే మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్​యూవీ, వరుసగా 4 మోడల్స్

మహీంద్రా విద్యుత్​ ఎస్​యూవీ సిరీస్​లో తొలి వాహనం 2024 ఆఖరుకు విడుదలవుతుందని వెల్లడించారు ఆ సంస్థ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. మొత్తంమీద 2024-26 సంవత్సరాలలో 4 విద్యుత్తు ఎస్‌యూవీలు రోడ్లపైకి రావొచ్చని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అఖిల భారత ఫుట్​బాల్​ సమాఖ్యను సస్పెండ్​ చేసిన ఫిఫా

పూర్తిస్థాయి కార్యవర్గం లేకపోవడం సహా సంబంధం లేని(థర్డ్ పార్టీ) వ్యక్తుల జోక్యం ఉందంటూ.. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యను ఫిఫా సస్పెండ్ చేసింది. దీంతో ఈ ఏడాది అక్టోబర్‌ 11వ తేదీ నుంచి 30 వరకు భారత్‌లో జరగాల్సిన అండర్​-17 మహిళల ప్రపంచ కప్ 2022 టోర్నీపై అనిశ్చితి నెలకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఈ సినిమా కోసం నా సర్వస్వం ఇచ్చేశా

విజయ్​ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్​ దర్శకత్వంలో వస్తున్న చిత్రం లైగర్​. పాన్​ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదలకు సిద్ధమైంది. ఈ తరుణంలోనే సోమవారం మీడియాతో మాట్లాడారు విజయ్. ఈ సందర్భంగా విజయ్‌ పంచుకున్న చిత్ర విశేషాలు కోసం ఇక్కడ క్లిక్​ చేయండి..

ABOUT THE AUTHOR

...view details