- ‘ఇంపాక్ట్’ భారం రూ.600 కోట్లు
పెరుగుతున్న భవన నిర్మాణ సామగ్రి ధరలకు ఇంపాక్ట్ ఫీజు తోడవ్వడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి నిర్మాణం కలగానే మిగిలిపోయేలా ఉంది. ఇళ్ల నిర్మాణ అనుమతుల కోసం ఇప్పటికే 7-10 రకాల ఫీజుల కింద లక్షల రూపాయలు పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఇంపాక్ట్ ఫీజు పేరుతో అదనపు భారం పడనున్నందున ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టర్న్‌కీ చెప్పిందే లెక్క
సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్లో విక్రయిస్తానంది. ఆర్టీసీ బస్సుల్లో యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ ద్వారా కండక్టర్లు ఆన్‌లైన్ టికెట్ల జారీ ఆరంభించారు. గనుల శాఖలో ఉమ్మడి రాష్ట్రం నుంచే ఆన్‌లైన్ వేబిల్లుల విధానం మొదలైంది. కానీ.. ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేస్తున్న టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్ (జేపీ సంస్థకు ఉపగుత్తేదారు)కు గనులశాఖ ఈ-పర్మిట్లు ఇవ్వట్లేదు. ఆ సంస్థ ఇసుక రవాణాదారులకు ఆన్‌లైన్ వేబిల్లులకు బదులు ముద్రిత బిల్లులే ఇస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వాయిదాల్లో బకాయిల చెల్లింపు
పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన రూ.7 వేల కోట్ల బకాయిలను డిస్కంలు 12 వాయిదాల్లో చెల్లించనున్నాయి. దీని ప్రకారం ప్రతి నెలా సుమారు రూ.600 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు భారీగా ఉన్న బకాయిలను ఒకేసారి చెల్లించడం డిస్కంలకు భారంగా మారుతున్న ఉద్దేశంతో వాయిదా పద్ధతిలో చెల్లించేలా వెసులుబాటు కల్పించడానికి లేట్ పేమెంట్ స్కీమ్ (ఎల్‌పీఎస్)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రోడ్డు ప్రమాదంలో గాయపడి.. కాపాడాలంటూ 40 నిమిషాలు ఆర్తనాదాలు
మినీ లారీ ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో క్లీనర్ మృతిచెందిన సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు కోల్డ్‌స్టోరేజి సమీపంలో శుక్రవారం జరిగింది. టమాటాల లోడుతో మదనపల్లె నుంచి నర్సీపట్నం వెళుతున్న లారీ కోల్డ్‌స్టోరేజీ సమీపంలో ఆగింది. కడప జిల్లా పోరుమామిళ్ల నుంచి ప్రకాశం జిల్లా కనిగిరికి పాలు, పెరుగు లోడుతో వెళుతున్న మినీ లారీ తెల్లవారుజామున 4:40 గంటల సమయంలో వేగంగా ఢీకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నీట్, జేఈఈ విలీనం.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు యూజీసీ సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. నీట్, జేఈఈ, సీయూఈటీ పరీక్షలను విలీనం చేయాలని భావిస్తోంది. మార్కులను బట్టి విభిన్న కోర్సుల్లో చేరే వెసులుబాటు కల్పించనున్నట్లు యూజీసీ ఛైర్మన్ ఎం.జగదీశ్‌కుమార్ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో స్థిరంగా కరోనా.. మరో 15 వేల మందికి వైరస్