- శత్రువు గుండెల్లో కవాతు.. మన సైనిక బలం అమేయం.. రక్షణ రంగం పటిష్ఠం
సహనం, సాత్వికం, సమోన్నత సాంస్కృతిక నేపథ్యమున్న భారత్‌ది మొదటి నుంచీ కయ్యానికి కాలు దువ్వే స్వభావం కాదు. స్వాతంత్య్రం వచ్చాక మన పాలకులు సమర్థ విదేశాంగ విధానం, పరిపక్వత చెందిన దౌత్యమే దేశానికి బలమైన రక్షణ విధానమని నమ్మారు. పంచశీలను వంచించి, చైనా చేసిన దాడితో ఆ నమ్మకాలు వమ్మయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో స్థిరంగా కరోనా కేసులు.. చిన్నారులకు లాంగ్ కొవిడ్ ముప్పు!
భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్థిరంగా ఉంది. తాజాగా 16,561 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. 24 గంటల వ్యవధిలో 18,053 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు కరోనా బారిన పడ్డ కొందరు చిన్నారుల్లో వ్యాధి లక్షణాలు తక్కువ తీవ్రతతోనే.. ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశాలున్నాయని తాజా అధ్యయనంలో తేలింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వైఎస్సార్ జిల్లాలో .. భారీగా బంగారం పట్టివేత
పన్ను కట్టకుండా అక్రమంగా కారులో తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ప్రొద్దుటూరు నుంచి కోయంబత్తూరుకు తీసుకెళ్తుండగా.. వైఎస్సార్ జిల్లా చాపాడులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో 3కిలోల బంగారంతో పాటు, రూ.1.30కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఖరీఫ్ సాగు.. కలవరమే.. అప్పటితో పోలీస్తే
గోదావరి, కృష్ణా నదులకు వరద పోటెత్తుతున్న.. ఖరీఫ్ సాగు కలవరంగానే ఉంది. ఆరంభంనుంచి ఇప్పటివరకు మొత్తంగా చూస్తే రాష్ట్రంలో వర్షపాతం సాధారణంగానే ఉన్నా 2021 ఆగస్టు 10నాటికి సాగైన విస్తీర్ణంతో పోలిస్తే 15 లక్షల ఎకరాలు తగ్గింది. ఖరీఫ్ సాగులో మూడేళ్లుగా పెరుగుతున్న నష్టాలతో సాహసించి ముందుకు సాగలేని పరిస్థితి దీనికి మరో కారణం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అన్నమయ్య జిల్లాలో దారుణం.. కోడలిని నరికి చంపిన అత్త
రాష్ట్రంలో రోజురోజుకూ హత్యలు పెరిగిపోతున్నాయి. తండ్రి మందలించాడని, కోడలు ఇంట్లో నుంచి బయటికి నెట్టిందని, ఆస్తి పంపకాలు సరిగా చేయడం లేదని, అక్రమ సంబంధాలు బయటపెడుతున్నారని ఏదోవిధంగా కక్ష పెంచుకుని.. తల్లిదండ్రులను కొడుకు చంపడమో లేక తోడబుట్టిన సోదరిని తమ్ముడు చంపడంలాంటివి చూస్తున్నాం. ఆలోచించి పరిష్కరించుకునే సహనం లేక అవతలి వారి ప్రాణాలను అవలీలగా తీసేస్తున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ బీచ్‌లో ఇసుక నల్లగా మారింది.. ఎందుకో తెలుసా