- ఆర్థికశాఖపై సీఎం సమీక్ష
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం 11గంటలకు ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్షించనున్నారు. కేబినెట్ భేటీ అజెండాలో చేర్చే అంశాలపై చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎన్జీటీ అనుమతులు
జాతీయ హరిత ట్రైబ్యునల్ చెన్నై జోనల్ బెంచ్ రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిపాలనా అంశాలపై టెండర్లకు అవకాశం కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అగ్నిప్రమాదంపై చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి
విశాఖ ఫార్మా సిటీలో అగ్నిప్రమాదంపై తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా దృశ్యాలు తీవ్రంగా కలిచివేశాయని తెలిపారు. కార్మికులంతా సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంలో ఒక్కరోజే 28,498 కేసులు
భారత్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులో 28,498 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 553 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సచిన్ పైలట్ మద్దతుదారుల సమావేశం
రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. తమ బలాలను చూపుకునేందుకు పోటీ పడుతున్నారు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్. సీఎం నివాసంలో సీఎల్పీ భేటీ జరిగిన కొద్ది గంటల్లోనే తమ మద్దతుదారులతో నిర్వహించిన సమావేశానికి సంబంధించిన ఓ వీడియో విడుదల చేసింది పైలట్ వర్గం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒడుదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు