- Kodali Nani PA: కొడాలి నాని పీఏ నన్ను వేధిస్తున్నాడు: దళిత మహిళ
Kodali Nani PA: ఎమ్మెల్యే కొడాలి నాని పీఏ తనను వేధిస్తున్నాడని ఓ దళిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కులం పేరుతో దూషిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Badude Badudu : బాదుడే బాదుడంటూ.. అసెంబ్లీ వైపు కదిలిన తెదేపా నేతలు
TDP leaders : ధరలు దిగిరావాలంటే జగన్ పోవాలంటూ.. తెదేపా నేతలు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో జే బ్రాండ్ పేరుతో దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుగ్లక్ పాలనలో పెట్రోల్, డీజిల్‌పై బాదుడు షాక్ కొట్టేలా ఉన్నాయంటూ తెదేపా నేతలు విమర్శించారు. ప్లకార్డుల ప్రదర్శిస్తూ.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి కాలినడకన వెళ్లారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వంతెనలేక.. నదిని దాటరాక..16 గ్రామాల ఇబ్బందులు...
Difficulties due to lack of bridge : వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని పెన్నానది ప్రవాహానికి వంతెన ఒరిగింది. మరమ్మతులు చేసేందుకని అధికారులు దానిని తొమ్మిది నెలల క్రితం తొలగించారు. ఆ వంతెన నిర్మాణం పూర్తయ్యేలోగా ప్రజల కోసం తాత్కాలికంగా మట్టిరోడ్డును నిర్మించారు అధికారులు. కానీ వంతెన పనులను ఇప్పటికీ దాన్ని పూర్తి చేయలేదు. తాత్కాలికంగా నిర్మించిన రోడ్ కూడా వరద ధాటికి కొట్టుకుపోయింది. ఫలితంగా 16గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది వంతెన పరిస్థితి..ప్రజల దుస్థితి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. -
- Flood: వధూవరులకు వరద కష్టాలు... పడవలో 5కిలో మీటర్లు ప్రయాణించి
Flood Problems: కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంకలో నూతన వధూవరులకు వరద కష్టాలు ఎదురయ్యాయి. వివాహం అనంతరం నూతన జంట పడవపై వరుడు ఇంటికి వెళ్లారు. అయితే గోదావరి ఉద్ధృతికి గ్రామాలు నీట మునగడంతో వధూవరులు సుమారు 5కిలో మీటర్ల పడవ ప్రయాణం చేసి అప్పనరామునిలంక చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సగం షేవింగ్ చేశాక డబ్బులు డిమాండ్.. గొడవ ముదిరి రెండు హత్యలు, ఆస్తులు ధ్వంసం
సెలూన్లో జరిగిన చిన్న గొడవ.. రెండు హత్యలు, మూక దాడులు, ఆస్తుల ధ్వంసానికి కారణమైంది. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కిన్వట్లో గురువారం రాత్రి జరిగిందీ ఘటన. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వేట కోసం వచ్చి బావిలో పడిపోయిన సింహం.. అధికారుల చొరవతో సేఫ్!
గుజరాత్‌లోని జునాఘడ్ ఓ సింహం వ్యవసాయ బావిలో పడిపోయింది. గమనించిన స్థానికులు మృగరాజుకి ఏ హానీ తలపెట్టకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- SCO Summit: పుతిన్‌తో మోదీ భేటీ.. జిన్‌పింగ్‌తోనూ చర్చలు!
SCO Summit 2022: ఉజ్బెకిస్థాన్‌లో జరుగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం చేరుకున్నారు. ఎస్‌సీవో సదస్సు సందర్భంగా పుతిన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. అయితే, జిన్‌పింగ్‌తోనూ ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యం.. టాయిలెట్లోనే ఏడ్చుకుంటూ బాలుడు.. చివరకు
టాయిలెట్లో ఉన్న బాలుడిని గమనించకుండా తాళం వేసి వెళ్లిపోయారు అంగన్వాడీ సిబ్బంది. దీంతో బాలుడు మరుగుదొడ్డిలోనే కొన్ని గంటలపాటు ఏడ్చుకుంటూ ఉండిపోయాడు. ఆఖరికి బాలుడి తల్లిదండ్రులు గమనించి అతడిని బయటకు తీశారు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బాల్‌బాయ్‌గా మొదలుపెట్టి.. దిగ్గజ ప్లేయర్‌గా ఎదిగి.. ఫెదరర్ విజయ ప్రస్థానం
Roger Federer Retirement : కళ్లు చెదిరే ఆ ఫోర్‌హ్యాండ్ షాట్లు, ఆహా అనిపించే ఆ ఒంటి చేతి బ్యాక్ హ్యాండ్ షాట్లు, మంత్రముగ్దుల్ని చేసే ఆ సర్వీసులు, ప్రత్యర్థిని బోల్తా కొట్టించే ఆ డ్రాప్‌లు.. ఇక జ్ఞాపకాలే. ఓ శకం ముగిసింది. కళాత్మక షాట్లతో ఆటకు అందాన్నద్ది.. అద్వితీయ ఆటతో టెన్నిస్ ప్రాచుర్యాన్ని పెంచి, హుందాతనంతో ఆకట్టుకుని.. రెండు దశాబ్దాలకుపైగా క్రీడాభిమానులను అలరించిన స్విస్ దిగ్గజం 'రోజర్ ఫెదరర్' ఆటకు గుడ్‌బై చెప్పేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సైరాట్' నటుడిపై చీటింగ్ కేసు.. సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం!
దేశవ్యాప్తంగా మంచి విజయం సాధించిన 'సైరాట్' మూవీలో ప్రిన్స్ దాదా పాత్రలో మెప్పించిన సూరజ్ పవార్‌పై చీటింగ్ కేసు నమోదైంది. త్వరలో అతడిని విచారించనున్నట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM