ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM - ap top ten news

..

11AM TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM

By

Published : Sep 15, 2022, 11:00 AM IST

  • TDP leaders Protest: "జాబ్ రావాలంటే... జగన్ పోవాలి"
    ఉద్యోగాల భర్తీ, జాబ్​ క్యాలెండర్​ విడుదల చేయకపోవడంపై తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. జాబ్ రావాలంటే... జగన్ పోవాలంటూ నినాదాలు చేశారు. జాబ్ ఎక్కడా..జగన్ ఎక్కడ..అని అసెంబ్లీలో ప్రశ్నిస్తామన్నారు. యువత నిర్వీర్యం, జాబ్ లెస్ క్యాలెండర్ అంశాలపై సభలో చర్చించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నాలుగో రోజు పాదయాత్ర ప్రారంభం...
    4th day Amaravati Farmers Padayatra: నాలుగో రోజు అమరావతి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. ఇవాళ 17 కిలోమీటర్లు అమరావతి రైతులు నడవనున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలపై రాజధాని రైతుల స్పందించారు. ఏమన్నారంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఓయో రూమ్‌కు తీసుకెళ్లి.. మత్తు మందు ఇచ్చి.. బాలికపై గ్యాంగ్ రేప్‌
    Gang rape in Old city: 16 ఏళ్ల బాలికపై యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన హైదరాబాద్​లోని పాతబస్తీలో జరిగింది. ఆ మైనర్​ను రెండు రోజులు పాటు ఓయో లాడ్జిలో ఉంచారు. ఆపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Smart life device: స్మార్ట్‌లైఫ్‌... విద్యుత్​ అవస్థల నుంచి రక్షించే పరికరం
    Smart life device: సామాన్యుల నుంచి సంపన్నుల వరకు! రైతుల నుంచి ఉద్యోగుల వరకు అందరిదీ నిత్యం విరామం లేని పోరాటమే. ఈ హడావుడి జీవితాల్లో.. విద్యుత్‌ వాడకం పెరగగా... వృథా కూడా ఎక్కువే అవుతోంది. దీనికితోడు విద్యుత్‌ ఛార్జీల బిల్లులు మోత మోగిస్తున్నాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు ఈ యువకులు.. అంకుర సంస్థను స్థాపించి స్మార్ట్‌లైఫ్‌ పేరిట ఓ పరికరం రూపొందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చెట్టుకు వేలాడుతూ దళిత మైనర్ల మృతదేహాలు.. రేప్ చేసి హత్య.. దివ్యాంగురాలిపై దారుణం
    ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్ల మృతదేహాలు.. గ్రామ శివార్లలో ఓ చెట్టుకు వేలాడుతూ అనుమానాస్పద రీతిలో లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని లఖింపుర్​ఖేరిలో జరిగింది. మరోవైపు, మైనర్​పై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ బస్​ డ్రైవర్​ ఇంటిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్​తో కూల్చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో పెరిగిన కరోనా కేసులు.. మూడు డోసులకూ లొంగని కొత్త వేరియంట్‌ వ్యాప్తి!
    Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 6,422 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 5,748 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు, మూడు డోసులకూ లొంగని కొత్త వేరియంట్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కాగా, కొవిడ్ ముగింపు దశకు వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పుకొచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కారు ప్రమాదానికి గురైన జెలెన్​స్కీ.. కాన్వాయ్​ను ఢీకొట్టిన వాహనం.. ఆ తర్వాత..
    ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్​ను ఓ కారు ఢీకొట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పడిపోయిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం ఎంతంటే?
    Gold Rate Today : దేశంలో బంగారం ధర తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సీనియర్​ మహిళా క్రికెటర్​​ అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్​బై
    ఆస్ట్రేలియా మహిళా సీనియర్ క్రికెటర్ రేచల్‌ హేన్స్‌ అంతర్జాతీయ క్రికెట్​తో పాటు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'త్వరలోనే అదిరిపోయే ఆరు కొరియన్‌ మూవీస్​ రీమేక్‌.. సమంతతోనూ ఓ చిత్రం!'
    త్వరలోనే ఆరు సూపర్​హిట్​ కొరియన్​ సినిమాలు తెలుగులో రీమేక్​ కానున్నాయి! అలాగే హీరోయిన్​ సమంత నటించబోయే కొత్త సినిమా అప్డేట్​ వచ్చింది. అదేంటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details