ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM - ap top ten news

..

11AM TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM

By

Published : Sep 2, 2022, 11:01 AM IST

  • High Court: "విద్యార్థులకు సీట్లు ఇవ్వకుంటే... మిమ్మల్ని జైలుకు పంపుతాం"
    HC warning to higher officials and CS: పేద పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25శాతం సీట్ల కేటాయింపు నిర్ణయం అమలు చేయకపోవడంపై హైకోర్టు మండిపడింది. పేద విద్యార్థులు జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారనినిలదీసింది. పేద పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించి భర్తీ చేసినట్లు రుజువులు చూపకపోతే జైళ్లలో మీకు సీట్లు కేటాయిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు.. పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ను హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇంద్రకీలాద్రిపై భక్తుల ఇక్కట్లు... ప్రణాళిక లేకుంటే దర్శనానికే బ్రేక్‌
    Indrakiladri temple: దుర్గగుడి దసరా వేడుకల్లో ఈ ఏడాది ఘాట్‌రోడ్డును క్యూలైన్లకే వదిలేసి.. ప్రముఖులను లిఫ్టుల్లో కొండపైకి తరలించాలనే ఆలోచనతో చిక్కులు తప్పేలా లేవు. సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇచ్చి.. ప్రముఖులను వేరే మార్గంలో తరలించాలనే ఆలోచన బాగున్నా.. సరైన ఏర్పాట్లు లేకుంటే చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దసరా సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల నుంచి లక్షల మంది భక్తులు దుర్గగుడికి తరలివస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గొంతుకోసి.. ఆలిని పాతిపెట్టి..
    Woman Murder: జీవితాంతం తోడుంటాడు అనుకున్న ఆ యువతికి భర్తే కాలయముడయ్యాడు. పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకే ఆ యువతికి భర్తతో గొడవలు ప్రారంభమయ్యాయి. వారిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారన్న ఆలోచన కూడా లేకుండా ఆ యువతిని భర్తే గొంతుకోసి హతమార్చడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఒక్క క్లిక్‌తో దస్తావేజులు ప్రత్యక్షం
    Digitalization of Documents: ప్రజలకు వేగంగా సేవలను అందించటానికి స్టాంపులు- రిజిస్ట్రేషన్ శాఖ పాత డ్యాంక్యుమెంట్ల డిజిటలీకరణకు శ్రీకారం చుట్టింది. 1999 తర్వాత రిజిస్ట్రేషన్ వివరాలు మాత్రమే అన్​లైన్​లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ డిజిటలీకరణ వల్ల 1999కు ముందు వివరాలను అన్​లైన్​లో అందుబాటులో ఉంచటానికి వీలవుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పంటల బీమా పథకంలో కీలక మార్పులు!
    ప్రధాన మంత్రి పంటల బీమా పథకం ద్వారా ఇన్సూరెన్స్‌ కంపెనీలే లాభపడుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. అవేంటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వరదలో కొట్టుకొచ్చిన ఏనుగు పిల్ల.. 65 గంటల శ్రమ తర్వాత తల్లి చెంతకు..
    తమిళనాడులోని నీలగిరి ప్రాంతానికి చెందిన అటవీ అధికారులు.. ఓ ఏనుగు పిల్ల కోసం 65 గంటల పాటు కష్టపడ్డారు. గతకొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఏనుగు పిల్ల వరదనీటిలో కొట్టుకొచ్చింది. దానిని గమనించిన అధికారులు రక్షించి.. తన తల్లి దగ్గరకు ఎలాగైనా చేర్చాలని నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జీతాల కోసం పైలట్ల బంద్​.. నిలిచిన 800 విమానాలు.. దిల్లీలో ప్రయాణికుల తిప్పలు
    జీతాలు పెంచాలని జర్మనీకి చెందిన ఓ ఎయిర్​లైన్ సంస్థ పైలట్లు బంద్​కు దిగారు. దీంతో శుక్రవారం మొత్తం 800 విమానాలను ఆ సంస్థ రద్దు చేసింది. అయితే ఫ్రాంక్​ఫర్ట్​, మ్యూనిచ్​ వెళ్లాల్సిన ప్రయాణికులు.. దిల్లీ ఎయిర్​పోర్ట్​లో ఇబ్బందులు పడ్డారు. వారి తరఫున వచ్చిన బంధువులు.. ఎయిర్​పోర్ట్​ ఎదుట ఆందోళనలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
    Gold Rate Today : దేశంలో బంగారం ధర శుక్రవారం తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కోహ్లీ బెస్ట్ బ్యాటర్‌.. కానీ ఆసీస్‌తో అంత ఈజీ కాదు: రికీ పాంటింగ్‌
    విరాట్​ కోహ్లీ ఫామ్​పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ స్పందించాడు. కోహ్లీ తిరిగి ఫామ్​లోకి వచ్చాడని, అతను అత్యుత్తమ బ్యాటర్​ అని ప్రశంసించాడు. అయితే ఆసీస్​తో తలపడేటప్పుడు అంతగా రాణించకపోవచ్చని చెప్పాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పవన్ కల్యాణ్​​ సినిమాల్లోకి రాకముందు ఇన్ని రంగాల్లో పనిచేశారా?
    ఓ వైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందు జీవితంలో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారట. ఈ క్రమంలోనే పలు రంగాల్లోనూ పనిచేశారట. ఆ సంగతులు తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details