- Gold medal ప్రపంచ ఫీల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో కడప యువకుడికి పసిడి
Gold medal ప్రపంచ ఫీల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో కడప యువకుడు సత్తా చాటాడు. ఆర్చరీ క్రీడాకారుడు ఉదయ్‌కుమార్ పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఎస్తోనియాలో జరిగిన ఆర్చరీ పోటీల్లో ఉదయ్‌కుమార్‌కు బంగార పతకం లభించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆశావాద దృక్పథంతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యమన్న జయప్రకాశ్ నారాయణ
Dr Vasireddy Narayana Rao ఆశావాద దృక్పథంతో ముందుకెళ్తేనే గ్రామీణాభివృద్ధి సాధ్యమని లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన వాసిరెడ్డి నారాయణరావు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాఠశాలల విలీనం ప్రాథమిక విద్యలో ఒక విధ్వంసమన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు
Merger of schools పాఠశాలల విలీనం ఊహకందని పెనువిషాదమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 25 నుంచి 31 వరకూ ఎమ్మెల్సీలు బడి కోసం బస్సు యాత్ర చేపట్టారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నుంచి వచ్చిన అభ్యంతరాలు, పరిష్కారాలతో వారు నివేదిక రూపొందించారు. పాఠశాలల విలీనానికి రాజకీయ ఒత్తిళ్లు తప్ప శాస్త్రీయత లేదని ఆక్షేపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Garbage tax చెత్త పన్ను చెల్లిస్తేనే చేయూత పథకం
Garbage tax చెత్త సేకరణ రుసుములు చెల్లిస్తేనే డ్వాక్రా సంఘాల మహిళలకు చేయూత పథకం వర్తిస్తుందని విశాఖలో ఆర్పీలు (రిసోర్స్ పర్సన్లు) వాట్సప్ వాయిస్ మేసేజ్‌లు పంపడం కలకలం సృష్టించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
INDIA COVID CASES: భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 14,092 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. రికవరీ రేటు 98.54 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.26 శాతానికి పడిపోయాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్వతంత్ర భారతంలో మహిళల విజయ ప్రస్థానం
ఆమె ఖ్యాతిగాంచని రంగం లేదు. సాధించని ప్రగతి లేదు. ఆత్మవిశ్వాసాన్ని ఆభరణంగా మలచుకుని విభిన్న వేదికలపై మహిళాలోకం వెలుగులీనుతోంది. స్వతంత్ర భారతంలో అతివల ప్రస్థానం ఆకాశమే హద్దుగా సాగుతోంది. వలసపాలన నుంచి విముక్తి పొందిన భారతావనిలో వనితాలోకం వడివడిగా పురోగమిస్తోంది. ఇందుగలరు అందులేరని సందేహం లేకుండా అతివలు అన్ని రంగాల్లో విజయకేతనం ఎగురవేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కోలుకుంటున్న సల్మాన్ రష్దీ వెంటిలేటర్ తొలగింపు
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ తొలగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రష్దీ ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారని వెల్లడించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం
ప్రముఖ వ్యాపారవేత్త, దిగ్గజ పెట్టుబడిదారు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూశారు. 62 ఏళ్ల వయసులో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం ఝున్‌ఝున్‌వాలా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉదయం 7 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబయిలోని బీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనా వ్యాక్సిన్ వేసుకోని జకోవిచ్ యూఎస్ ఓపెన్‌లో ఆడనున్నాడా
కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన టెన్నిస్ స్టార్ జకోవిచ్ యూఎస్ ఓపెన్‌లోనూ పోటీపడడం అనుమానంగా మారింది. అమెరికా నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ వేసుకోని విదేశీయులకు ఆ దేశంలో ప్రవేశం లేదు. దీంతో అతను పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉత్తమ నటుడిగా ఆస్కార్ రేసులో తారక్
హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరు నెట్టింట మారుమోగిపోతోంది. ఆస్కార్ రేసులో తారక్ ఉన్నారంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఉత్తమ నటుడి క్యాటగిరీలో ఎన్టీఆర్ పేరు కచ్చితంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటేపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
11 AM టాప్ న్యూస్