ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు @11AM

..

11AM TOP NEWS
ప్రధానవార్తలు @11AM

By

Published : Aug 8, 2022, 10:59 AM IST

  • దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. జపాన్​లో 2లక్షల మందికి వైరస్

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం మధ్య 16,167 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 41 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 6.14 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్​ నుంచి 15,549 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉద్యమం కాదు.. జన ఉప్పెన.. చారిత్రక సంగ్రామానికి 80 ఏళ్లు

'డు ఆర్​ డై' అంటూ మహాత్మ గాంధీజీ ఇచ్చిన ఒక్క పిలుపుతో ఉవ్వెత్తున దూసుకెళ్లింది ఆ ఉద్యమం... సమాచార వ్యవస్థ నామమాత్రంగా ఉన్న ఆ రోజుల్లో దేశంలోని ప్రతి ఊరిలో ప్రజలు ఎవరికి వారే నాయకులై.. కదం తొక్కేలా చేసింది.. క్విట్ ఇండియా పేరుతో జరిగిన చారిత్రక ఉద్యమం.. బ్రిటిష్ గుండెల్లో గుబులు పుట్టించింది. స్వాతంత్ర్య పోరాటంలో తుది సంగ్రామంగా నిలిచిన 'క్విట్ ఇండియా'కు 80 ఏళ్లు నిండాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పరవాడ పారిశ్రామిక పార్కులో అగ్ని ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

అనకాపల్లి జిల్లా పరవాడ ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫెర్రో కెమికల్స్ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో.. ఆయిల్‌ ట్యాంకర్‌ దగ్ధమైంది. మంటల్ని అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా.. కేజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ‘నోరు మూసుకో.. నీ ఇంటికొచ్చానమ్మా.. నిద్రపోతున్నావ్‌’

సమస్య నివేదించిన గ్రామస్థులపై కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నోరు మూసుకో.. ’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నీ ఇంటికొచ్చానమ్మా.. నిద్రపోతున్నావ్‌’ అంటూ మహిళతో దురుసుగా మాట్లాడారు. అసలేం జరిగిందంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాజధానిపై సుప్రీంకు.. అమరావతి రైతులు

ఏపీ రాజధానిపై అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయడంలో రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పిల్​ దాఖలు చేశారు. రాజధాని అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని సవాల్‌ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి తరఫున రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • "వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి.. ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత"

రాష్ట్రంలో ఆప్కో ద్వారా వంద కోట్ల వ్యాపారం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేతని అన్నారు. రాష్ట్రంలో సుమారు లక్షా 50 వేల మంది ప్రత్యక్షంగా ...మరో 50 వేల మంది పరోక్షంగా చేనేతపైనే ఆధారపడినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'దుస్తులు, బూట్లు ఎక్కడపడితే అక్కడే.. ఓరి దేవుడా!'.. భార్య గురించి రిషి సునాక్​

బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్న రిషి సునాక్‌ .. వరుస భేటీలతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవిత భాగస్వామి అక్షతా మూర్తి గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. వారి తొలి పరిచయం మొదలు.. ఆమె వ్యవహార తీరు, కుటుంబ బాధ్యతలు, పెళ్లి నాటి విషయాలను రిషి సునాక్‌ మీడియాకు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఆకాశ ఎయిర్' సేవలు షురూ.. అహ్మదాబాద్​కు తొలి ఫ్లైట్

దేశంలో కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ఆదివారం జెండా ఊపి సర్వీసుల్ని ప్రారంభించారు. తొలి విమానం ముంబయి నుంచి అహ్మదాబాద్​ వెళ్లింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్పిన్నర్ల మాయ.. చివరి టీ-20లోనూ విండీస్ చిత్తు

వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ అదరగొట్టింది. ఐదో టీ20 మ్యాచ్‌లో ప్రత్యర్థి విండీస్‌ను చిత్తుచిత్తుగా ఓడించి సిరీస్‌ను 4-1 తేడాతో చేజిక్కించుకుంది. శ్రేయస్‌ అయ్యర్‌ (64; 40 బంతుల్లో 8×4,2×6) మెరుపు ఇన్నింగ్స్‌కు బౌలర్ల సమష్టి కృషి తోడవ్వడంతో ఫ్లోరిడా వేదికగా జరిగిన నామమాత్రపు ఐదో మ్యాచ్‌లో 88 పరుగుల భారీ తేడాతో విజయదుందుభి మోగించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సంక్షోభంలో టాలీవుడ్​.. పరిష్కారం దొరుకుతుందా?

ఇతర పరిశ్రమలతో పోలిస్తే కొవిడ్‌ దెబ్బ నుంచి త్వరగానే కోలుకొని సాధారణ స్థితికి చేరుకున్నట్లుగా కనిపించిన టాలీవుడ్‌- ప్రస్తుతం కొన్ని స్వీయ తప్పిదాల వల్ల సంక్షోభ స్థితిని కొనితెచ్చుకొంది. టికెట్​ రేట్లు, నిర్మాణ వ్యయాలు, ప్రేక్షకుల థియేటర్లకు రాకపోవడం, ఓటీటీలో సినిమాల విడుదల ఇలా పలు సమస్యలు తెలుగు చిత్రసీమను చుట్టుముట్టి షూటింగ్​లు ఆపేస్థితికి చేర్చాయి. మరి దీని పరిష్కారం ఎలా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details