- MLC Ashok Babu Arrest: అశోక్‌బాబు అరెస్ట్‌పై తెదేపా నేతల ఆందోళన..పలువురు అరెస్ట్
తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు ఖండించారు. జగన్ అరాచక పాలన సాగిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. గతంలో జగన్ జైలుకు వెళ్లినందునే.. అందరినీ పంపాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన పలువురు తెదేపా నేతలకు పోలీసులు అరెస్ట్ చేశారు.
- Cinema Ticket Prices In AP: సినిమా టికెట్ ధరల పెంపు.. కొత్త ధరలు ఇవే..!!
Cinema ticket prices hike in AP: సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సినీరంగ ప్రముఖులతో జరిగిన చర్చల్లో సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
- Appalaraju Issue: బాధగా ఉంది సార్.. చొక్కా విప్పి కొడతాననడం కరెక్టేనా?
Appalaraju issue Audio viral: సీఐపై ఓ ప్రజాప్రతినిధి దుర్భాషలాడిన ఘటన తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని ఓ మహిళా ఏఎస్సై ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని ఓ స్టేషన్లో పనిచేసే ఏఎస్సై వాయిస్ రికార్డు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎంత రాజకీయ నాయకుడైతే మాత్రం ప్రభుత్వ ఉద్యోగిపై నోరు పారేసుకుంటారా సార్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
- Road Accidents: వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి
Road Accidents: కర్నూలు జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. కల్లూరు మండలం ఉలిందకొండ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నందికొట్కూరు మండలం దామగట్ల క్రాస్ రోడ్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
- దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?
Covid cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా 58,077 మందికి వైరస్ సోకింది. మరో 657 మంది మరణించారు. 1,50,407 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
- 'కాంగ్రెస్ పాలనలో అంధకారం.. ఇప్పుడు అమృతకాలం'
Nirmala Sitharaman News: అవినీతి, ద్రవ్యోల్బణం కాంగ్రెస్ హయాంలో రాజ్యమేలాయన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2020-21 సంవత్సరంలో దేశంలో 1 బిలియన్ డాలర్ విలువ చేరుకున్న 42 స్టార్టప్‌లను గుర్తించామని వెల్లడించారు. దేశంలో అమృతకాలానికి ఇదే నిదర్శనమన్నారు.
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 970 పాయింట్లు డౌన్
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల దిశగా పయనిస్తున్నాయి. అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడగా.. అక్కడి మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. దీనికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం 7.5 శాతం వద్ద 40 ఏళ్ల గరిష్ఠానికి చేరడమే అని నిపుణులు చెప్తున్నారు.
- 'FIR' సినిమాపై ఆ మూడు దేశాల్లో నిషేధం
FIR movie: తమిళ హీరో విష్ణు విశాల్ 'ఎఫ్ఐఆర్' సినిమాను మూడు అరబ్ దేశాల్లో నిషేధించారు. శుక్రవారమే ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది.