ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు@11AM - ప్రధాన వార్తలు@11AM

ప్రధాన వార్తలు@11AM

11AM TOP NEWS
ప్రధాన వార్తలు@11AM

By

Published : Jan 4, 2022, 11:01 AM IST

  • ఏపీ ప్రభుత్వంపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్ దాడి

మంత్రి పేర్ని నానికి ట్విట్టర్‌ ద్వారా రాంగోపాల్‌ వర్మ ప్రశ్నలు సంధించారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆర్జీవీ డిమాండ్ చేశారు. సినిమా సహా ఏదైనా ఉత్పత్తికి ధర నిర్ణయంలో ప్రభుత్వ పాత్ర ఎంత ఉందంటూ అడిగారు.

  • CM KCR Comments on Lockdown: లాక్​డౌన్​ లేదు కానీ.. 8 నుంచి విద్యాసంస్థలకు సెలవులు..:

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తెలంగాణలో లాక్​డౌన్ విధించే పరిస్థితులు ప్రస్తుతం లేవని తెలంగాణ అధికారులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​కు నివేదించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను పటిష్ట పరచాలన్న సీఎం... రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి 16 వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు.

  • VENKAIAH NAIDU: తాళపత్రాల రూపకర్తకు ఉపరాష్ట్రపతి ప్రశంస

తాళపత్రాల రూపంలో వేమన, సుమతి శతకాలను, భగవద్గీత శ్లోకాలను రూపొందించిన గాజుల సత్యనారాయణను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. ఇలాంటి వినూత్న ఆలోచనలు పిల్లలను ఆకర్షించి వారిలో ఆసక్తిని పెంచుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

  • KTR about Punjab Champion: పంజాబ్‌ ప్రభుత్వంపై దివ్యాంగ క్రీడాకారిణి ఆగ్రహం.. అండగా కేటీఆర్‌

పంజాబ్‌ ప్రభుత్వంపై దివ్యాంగ క్రీడాకారిణి మాలిక హండా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగంతో పాటు ఆర్థిక ప్రోత్సాహకం అందజేస్తామన్న హామీని ఆ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని వాపోయింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేసింది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.

  • ఒడిశాలో అనుమానాస్పద పావురం.. కాలికి చైనా ట్యాగ్​!

Suspicious Pigeon: ఒడిశాలో ఓ అనుమానాస్పద పావురం కాలికి చైనా ట్యాగ్​ ఉండటం కలకలం రేపింది. గాయంతో కిందపడ్డ ఆ పావురాన్ని రక్షించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెంటనే ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు.

  • India covid cases: దేశంలో కొత్తగా 37,379 మందికి కరోనా

India covid cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే 37,379 కేసులు నమోదయ్యాయి. కొవిడ్​తో 124 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,007 మంది కొత్తగా కోలుకున్నారు. దేశంలో రోజువారీ కొవిడ్​ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉంది.

  • కరోనా ప్రళయం.. అమెరికాలో ఒక్కరోజే 10 లక్షల కేసులు

Corona cases in America: అగ్రరాజ్యంలో కరోనా మహమ్మారి రాకెట్​ వేగంతో దూసుకెళుతోంది. సోమవారం ఒక్కరోజే 10లక్షలు కేసులు నమోదయ్యాయి. వైరస్​ బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో లక్షకుపైగా చికిత్స పొందుతున్నారు.

  • కరోనా ముగింపు దశ ఎలా ఉంటుంది?

కరోనా వైరస్‌ను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని, అది ఎప్పటికీ జనబాహుళ్యంలోనే ఉంటుందని, దానితో కలిసి మనుగడ సాగించడాన్ని ప్రపంచం నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఏదో ఒక దశలో చెప్పుకోదగ్గ సంఖ్యలో దేశాలు.. కొవిడ్‌ కేసులను గణనీయ స్థాయిలో తగ్గించుకోగలిగితే మహమ్మారి (ప్యాండెమిక్‌)కి అధికారికంగా ముగింపు పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటిస్తుంది.

  • AUS vs ENG 4th Test: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ తుదిజట్లివే

Ashes 2021: యాషెస్ సిరీస్​లో మరో కీలకపోరుకు రంగం సిద్ధమైంది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య బుధవారం నుంచి నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో రెండు జట్లు వారి తుదిజట్లను ప్రకటించాయి.

  • 'రాధేశ్యామ్​' ఓటీటీ రిలీజ్​కు కళ్లు చెదిరే ఆఫర్!​

RadheShyam OTT release: ప్రభాస్​ నటించిన 'రాధేశ్యామ్'​ డిజిటల్​ రిలీజ్​ కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్​ను ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే చిత్రబృందం మాత్రం థియేటర్లలో సినిమా విడుదల చేసేందుకే మొగ్గు చూపుతోందట.

ABOUT THE AUTHOR

...view details