- జలాశయానికి భారీ వరద
ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీశైలానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 874.40 అడుగులకు నీరు చేరింది. మరో 55 టీఎంసీల నీరు వస్తే... శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వర్షాలు తగ్గాక పనులు చేస్తాం..!
రహదారుల మరమ్మతులకు.. రవాణా, ఆర్‌అండ్‌బీ చర్యలు తీసుకుంటోంది. వర్షాలు తగ్గాక పునరుద్ధరణ పనులు చేసేందుకు.. టెండర్లను ఆహ్వానిస్తోంది. మొత్తం 1,140 పనులుండగా.. ఇప్పటికే 403 పనులను గుత్తేదారులకు అప్పగించారు. బిల్లుల చెల్లింపులో జాప్యం అవుతుందనే భావనలో గుత్తేదారులు ఉన్నారని.. వాటిని దూరం చేస్తామని ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆసుపత్రిలో భూత వైద్యం
ఆమెకు జ్వరం వచ్చింది. ఆసుపత్రికి తీసుకువెళ్లారు. నాలుగు రోజులైంది. అయినా మార్పు రాలేదు. రోజురోజుకూ నీరసించిపోతోంది. చివరికి అందుబాటులో ఉన్న మహిళా భూత వైద్యురాలిని ఆసుపత్రి వార్డుకు తీసుకువచ్చారు. ఆమె వార్డులోనే రోగి నాడి పట్టుకుని మంత్రాలు జపించింది. ఈ దృశ్యం విశాఖ ఏజెన్సీ పాడేరు ఆసుపత్రిలో కలకలం సృష్టించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యునెస్కోకు పుస్తకం రాశా!
ప్రఖ్యాత కాకతీయ కట్టడమైన రామప్ప... యునెస్కో వారసత్వ గుర్తింపు పొందేందుకు...ఎంతోమంది ఎన్నో విధాల కృషి చేశారు. కొందరు ఏళ్లకేళ్లు పరిశోధన సాగిస్తే... మరికొందరు మహోతృష్ణమైన శిల్ప సంపదతో అలరారే కట్టడం గురించి... రచనలు చేశారు. రామప్ప శిల్ప వైభవాన్ని ప్రపంచ దృష్టికి తీసుకొచ్చారు. అలాంటివారిలో ప్రముఖ నృత్యకారిణి, చరిత్ర పరిశోధకురాలు చూడామణి నందగోపాల్ ఒకరు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు(Covid 19 India) భారీగా తగ్గాయి. కొత్తగా 29,689 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొవిడ్ కారణంగా మరో 415 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4లక్షల 21 వేలు దాటింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ప్రత్యక్ష సాక్ష్యమే ఉత్తమం'