- పెరుగుతున్న వరద
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండల గ్రామాలు వరద ముప్పులో ఉన్నాయి. నిత్యావసరాల కోసం పడవలపైనే స్థానికులు ప్రయాణం సాగిస్తున్నారు. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 2రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రూ.200 కోట్లు డిపాజిట్ చేయండి!
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్యబోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో రెండు బోర్డులకు చెరో రూ.200 కోట్లు డిపాజిట్ చేయాలని అవి కోరుతున్నాయి. ఈ మేరకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లు వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు లేఖలు పంపారు. బోర్డుల నిర్వహణకు రూ.200 కోట్ల చొప్పున మూలనిధిగా ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'దర్యాప్తు వేగవంతం చేయండి'
రాష్ట్రపతికి, ప్రధానికి వైకాపా ఎంపీలు విడివిడిగా లేఖలు రాశారు. రఘురామరాజు మరో విజయ్ మాల్యాగా మారకుండా ఆయన కంపెనీలపై దర్యాప్తు వేగవంతం చేయాలని అందులో పేర్కొన్నారు. ఆయన సంస్థల్లో రూ.941.71 కోట్ల మోసం జరిగిందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సంబంధం లేకుండా విచారించొచ్చు
సీఎం జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సీబీఐ కేసుల తరువాతే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులపై విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌లపై శుక్రవారం ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరో 39 వేల కరోనా కేసులు
దేశంలో కొత్తగా 39,097 మందికి కరోనా(Covid 19 India) సోకింది. మరో 35 వేల మంది కోలుకోగా.. 546 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రపంచం గ్రహించింది