- వర్షాలు విస్తారంగా...!
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో వానలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది.ఏపీ తీరప్రాంత జిల్లాల్లో గంటకు 20-30 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసింది. విశాఖకు 2, పోలవరానికి 2 భద్రాచలం 1, కర్ణాటకకు 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
రాష్ట్రంలో పెద్ద ఎత్తున క్రైస్తవ మతంలోకి ప్రజలను మారుస్తున్నారని వచ్చిన ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ 15 రోజుల్లోగా నివేదిక అందజేయాలని సీఎస్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాఠ్య పుస్తకాలు లేకుండానే
ఇంటర్ పాఠ్య పుస్తకాలు లేకుండానే.. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు చెబుతున్నారు. దాదాపు 2.50 లక్షల మంది పిల్లలకు పుస్తకాలను అందించాల్సి ఉన్నా... ఈ ఏడాది ప్రింటింగ్‌కు ఇవ్వడంలో జాప్యం కారణంగా ముద్రణ పూర్తి కాలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇళ్లను తొలగించేందుకు అధికారుల యత్నం
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అమరారెడ్డినగర్‌లో రాత్రికిరాత్రే అధికారులు ఇళ్లు తొలగించటం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇళ్లలో ఉన్న సామాన్లు బయటకు తీసేందుకు కూడా సమయమివ్వలేదని.. కూల్చివేత ఆపాలంటూ విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన చెందారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆ రోజులు రావాలి'
ప్రాంతీయభాషల్లో ఇంజినీరింగ్ కోర్సులు నిర్వహించడం.. విద్యార్థుల పాలిట వరంగా మారుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. మాతృభాషల్లో చదువు నేర్చుకోవడంవల్ల విద్యార్థులకు సంగ్రహణ, అవగాహన శక్తి పెరుగుతుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 41 వేల కరోనా కేసులు