- భారీగా భద్రత పెంపు
పులిచింతల ప్రాజెక్టు నుంచి విధివిధానాలకు భిన్నంగా తెలంగాణ అధికారులు జలవిద్యుత్తు ఉత్పత్తి కోసం నీటిని వినియోగించి దిగువకు వదిలేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కృష్ణా జలాల వినియోగం విషయంలో వివాదం దృష్ట్యా పులిచింతల ప్రాజెక్టు వద్ద పోలీసుల భారీగా మోహరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ
ఆంధ్రప్రదేశ్ తక్షణమే ఆర్డీఎస్ కుడికాల్వ విస్తరణ పనులను నిలిపివేసేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గ్రామ సచివాలయానికి తాళం!
ప్రకాశం జిల్లాలో ఒక గ్రామ సచివాలయానికి భవనం యజమాని తాళం వేశారు. 13 నెలలుగా అద్దె చెల్లించడం లేదని విసుగు చెంది.. గత్యంతరం లేకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సామాన్య భక్తుల నిరీక్షణ
శ్రీవారి దర్శనం కోసం సామాన్య భక్తులు నిరీక్షిస్తున్నారు. సర్వ దర్శనం ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 12 నుంచి ఇప్పటివరకు సర్వదర్శనం టికెట్లను జారీ చేయలేదు. దీంతో పేద, సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి దూరమయ్యామని ఆవేదన చెందుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరో 48,786 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 48,786 కరోనా కేసులు నమోదయ్యాయి. 61,588 మంది కోలుకోగా 1005 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా బుధవారం 27,60,345 డోసుల పంపిణీ జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మారాలి పోలీసు ధోరణి