ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు @11AM

..

11AM TOPNEWS
ప్రధానవార్తలు @11AM

By

Published : Aug 9, 2022, 10:59 AM IST

  • దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 4నెలల వరకు లాంగ్ కొవిడ్ ముప్పు!

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం మధ్య 12,751 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 42 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 3.50 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్​ నుంచి 16,412 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.51 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.30 శాతంగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శునకానికి కన్నీటి వీడ్కోలు.. కారులో ఊరేగింపు..

ఒడిశాలో ఓ శునకానికి ఘనంగా అంత్యక్రియలు జరిపించింది ఓ కుటుంబం. 17ఏళ్లుగా ఎంతో విశ్వాసంతో తమతో కలిసి ఉన్న శునకానికి కారులో ఊరేగిస్తూ అంతిమయాత్ర నిర్వహించింది. గజపతి జిల్లాలోని పార్లాఖేముందీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తున్ను గౌడ కుటుంబం 17 ఏళ్లుగా ఈ శునకాన్ని పెంచుకుంటోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'విభజన హామీల అమలుపై దృష్టి పెట్టాలి'

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి సంబంధించిన హామీల అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి సూచించారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పర్యవేక్షిస్తేనే ప్రగతి పనులు వేగం పుంజుకుంటాయని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వీఆర్వోలకు సంజాయిషీ నోటీసులు.. ఎందుకంటే..?

మ్యుటేషన్‌, ఇతర ధ్రువీకరణపత్రాల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించని రెవెన్యూ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు మొదలయ్యాయి. జిల్లా సంయుక్త కలెక్టర్లు గతంలో ఎన్నడూ లేని విధంగా వీఆర్వోలకు సంజాయిషీ నోటీసులు జారీ చేస్తున్నారు. కొన్నిచోట్ల సస్పెన్షన్లు కూడా జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • "మంకీ పాక్స్‌కు కూడా మందు తయారు చేస్తాను"

కరోనా నివారణకు మందు తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఆనందయ్య.. మంకీ పాక్స్​కు కూడా మందు తయారు చేయనున్నట్లు తెలిపారు. విశాఖలో ఏర్పాటు చేసిన బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రకృతి వైద్యంలో ప్రతి వ్యాధికి మందు ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఒక్క మంకీ పాక్స్ రోగి కూడా తన వద్దకు రాలేదని.. వచ్చినట్లయితే వ్యాధి లక్షణాలను బట్టి మందు తయారు చేస్తానని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'డిసెంబరు నాటికి ఆ నిర్మాణాలు పూర్తికావాలి'

విలేజ్​ హెల్త్​ క్లినిక్​ల నిర్మాణాలు డిసెంబరులోగా పూర్తికావాలని అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. వీటివల్ల గ్రామీణులకు మంచి వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. పనుల పురోగతిపై ప్రతినెలా సమీక్ష జరుపుతామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ట్రంప్ ఇంటిపై ఎఫ్​బీఐ దాడులు.. లాకర్లు బద్దలు.. ఆ రహస్య పత్రాల కోసమే?

అమెరికా మాజీ అధ్యక్షుడి ఇంటిపై ఎఫ్​బీఐ దాడులు నిర్వహించింది. తన ఇంటిని ఎఫ్​బీఐ ఏజెంట్లు ఆక్రమించుకున్నారని.. లాకర్లను పగులగొట్టారని ట్రంప్ మండిపడ్డారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లను అడ్డుకోవాలన్న కుట్రతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చైనా కంపెనీలకు షాక్.. రూ.12వేల లోపు ఫోన్లపై నిషేధం?

చైనా మొబైల్ సంస్థలపై కేంద్రం కత్తిదూయనుందా?.. ఇకపై రూ.12వేల లోపు ఫోన్లు విక్రయాలపై పరిమితులు విధించనుందా? అంటే.. విశ్వనీయ వర్గాలు ఔననే అంటున్నాయి. భారత్​ రెండో అతిపెద్ద మొబైల్ విపణి కాగా.. ఈ మార్కెట్​ను కోల్పోవడం చైనా సంస్థలకు పెద్ద దెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • క్రీడల్లో మరింత ఎదగలేమా?

కామన్వెల్త్​ క్రీడలు 2022ను భారత్​ నాలుగో స్థానంతో ముగించింది. మొత్తం 61 పతకాలు సాధించింది. ఇందులో 22 స్వర్ణపతకాలు సహా 16 రజతం, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. అయితే భిన్న క్రీడాంశాల్లో పతకాలను ఒడిసిపట్టడంలో ఈసారీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, కెనడాల ఆధిపత్య ప్రదర్శన కొనసాగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సీత'.. ఆ పేరులో ఉన్న మ్యాజిక్కే వేరు.. అన్నీ సూపర్​హిట్టే!

'ఓ సీతా.. వదలనిక తోడౌతా' అంటూ ఇటీవలే వచ్చిన 'సీతారామం'లో సాంగ్​ సహా ఆ మూవీ ఎంతలా బ్లాక్ బస్టర్​ హిట్​గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ ప్రేమ కావ్యానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. హీరోహీరోయిన్ కెమిస్ట్రీ వీక్షకుల మనసుల్ని తాకుతోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని హీరోయిన్​ పాత్ర పేరుకు(సీత) కూడా బాగా కనెక్ట్​ అయిపోతున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details