CORONA CASES: కొత్తగా 1,186 కరోనా కేసులు.. 10 మరణాలు - covid deaths in ap
16:34 September 01
today ap corona cases
రాష్ట్రంలో కొవిడ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 56,155 మంది నమూనాలు పరీక్షించగా 1,186 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో పది మంది మృతి చెందారు. కరోనా నుంచి తాజాగా 1,396 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,473 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల కృష్ణాలో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, తూర్పుగోదావరి, చిత్తూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
ఇదీ చదవండి
Rajath kumar: 'కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోంది'