ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేరుశనగ గింజ గొంతులో ఇరుక్కుని బాలిక మృతి - పల్లీ ఇరుక్కుని మృతి వార్తలు

వేరుశనగ గింజ గొంతులో ఇరుక్కుని పదకొండు నెలల బాలిక మృతి చెందిన ఘటన తెలంగాణలోని నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్​ గ్రామంలో జరిగింది. నాలుగు రోజుల క్రితం ఘటన జరగగా హైదరాబాద్​ నిలోఫర్​లో చికిత్స పొందుతున్న చిన్నారి గురువారం చనిపోయింది.

వేరుశనగ గింజ గొంతులో ఇరుక్కుని బాలిక మృతి
వేరుశనగ గింజ గొంతులో ఇరుక్కుని బాలిక మృతి

By

Published : Sep 24, 2020, 10:31 PM IST

తెలంగాణలోని నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్​ గ్రామానికి చెందిన ప్రణీత.. ఈ నెల 19న సాయంత్రం పల్లీలు తినగా.. ప్రమాదవశాత్తు.. పాప గొంతులో ఇరుక్కున్నాయి. ఒక గింజ ఊపిరితిత్తుల్లోకి వెళ్లగా వెంటనే హైదరాబాద్​లోని నిలోఫర్​ ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు.

అయితే గురువారం మధ్యాహ్నం.. చిన్నారి మరణించినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి

తగ్గినట్టే తగ్గి పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 7855

ABOUT THE AUTHOR

...view details