ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MEDALS: 11మంది గ్రేహౌండ్స్‌ సిబ్బందికి ముఖ్యమంత్రి శౌర్య పతకాలు - ap latest news

ఏపీ గ్రేహౌండ్స్‌ విభాగంలో పనిచేస్తున్న 11 మంది సిబ్బందికి ముఖ్యమంత్రి శౌర్య పతకాలకు ఎంపికయ్యారు. అలాగే అత్యుత్తమ సేవలందించిన మొత్తం 273 మంది అధికారులకు ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించింది.

11-members-of-greyhound-staff-get-chief-minister-sourya-pathakalu
11మంది గ్రేహౌండ్స్‌ సిబ్బందికి ముఖ్యమంత్రి శౌర్య పతకాలు

By

Published : Nov 9, 2021, 11:08 AM IST

ఏపీ గ్రేహౌండ్స్‌ విభాగంలో పని చేస్తున్న జి.నాగశంకర్‌, జి.ప్రసాద్‌, బి.రమేష్‌, ఎం.శ్రీనివాసరావు, ఏ.సురేష్‌, జి.ఎస్‌.రామారావు, కె.జగదీష్‌, డి.గోవిందబాబు, జె.ఈశ్వరరావు, పి.పెంచలప్రసాద్‌, డి.నాగేంద్రలు ముఖ్యమంత్రి శౌర్య పతకానికి ఎంపికయ్యారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు, విజిలెన్స్‌, ఎస్‌పీఎఫ్‌ విభాగాల్లో అత్యుత్తుమ సేవలందించిన మొత్తం 273 మంది అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించింది.

పోలీసు శాఖలో 11 మందికి ముఖ్యమంత్రి శౌర్య పతకం, ముగ్గురికి మహోన్నత సేవా, 32 మందికి ఉత్తమ సేవా, 30 మందికి కఠిన సేవా, 159 మందికి సేవా పతకాలు ప్రకటించారు. విజిలెన్స్‌ విభాగంలో ఒకరికి ఉత్తమ సేవా పతకం, 18 మందికి ఏపీ పోలీసు సేవా పతకాలు లభించాయి. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ విభాగంలో ముగ్గురు ఉత్తమ సేవా, 13 మంది సేవా పతకాలకు ఎంపికయ్యారు.

ABOUT THE AUTHOR

...view details