- పూడిమడక తీరంలో గల్లంతైన మరో రెండు మృతదేహాలు లభ్యం.. కొనసాగుతున్న గాలింపు
పూడిమడక తీరంలో గల్లంతైన వారిలో మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 2 హెలికాప్టర్లు, 4 బోట్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు.
- Suspension: దివ్యాంగ యువకుడి ఆత్మహత్య.. నలుగురు పోలీసుల సస్పెన్షన్
Suspension: నెల్లూరు జిల్లా మర్రిపాడు వాసి తిరుపతి ఆత్మహత్య కేసులో నలుగురిపై వేటు పడింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ సహా నలుగురిపై సస్పెన్షన్ విధిస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక విచారణతో ఎస్పీ చర్యలకు ఆదేశించారు.
- నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం.. బాలిక కుటుంబీకుల చేతిలో హతం
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తి.. బాధిత బాలిక కుటుంబీకుల చేతిలో హతమయ్యాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..?
- ఆగస్టు 1న శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు విడుదల
ఆగస్టు 1న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు విడుదల కానున్నాయి. 600 టికెట్లు జారీ చేయనున్నట్లు తితిదే వెల్లడించింది. మూడ్రోజుల పాటు జరిగే స్నపన తిరుమంజనం, చివరిరోజు పూర్ణాహుతిలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.
- దేశంలో తగ్గని కొవిడ్ ఉద్ధృతి.. అమెరికాలో లక్ష, జపాన్లో 2 లక్షల కేసులు
Covid Cases In India: భారత్లో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 20,408 మంది వైరస్ బారిన పడగా.. 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు జపాన్లో కొత్తగా 2.30 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
- బలమైన ప్రభుత్వమంటే నియంత్రించడం కాదు: మోదీ
PM MODI CHENNAI VISIT: యువత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేలా కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయం 42వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. తమ హయాంలోని బలమైన ప్రభుత్వం దేన్నీ నియంత్రించదని పేర్కొన్నారు. కరోనా ప్రభావం ప్రతి దేశంపైనా పడిందని.. భారత్ దాన్నుంచి బయటపడేందుకు శాస్త్రవేత్తలు, నిపుణులు, ప్రజలు తోడ్పడ్డారని తెలిపారు.
- మనం ఎందుకు నిద్రించాలి? జ్ఞాపకాలు ఎలా ఏర్పడతాయో తెలుసా?
మానవులు ఎందుకు నిద్రించాలి? కొన్ని వేల సంవత్సరాలుగా శాస్త్రవేత్తల మదిలో ఉన్న ప్రశ్న ఇది. మానవుల్లో జ్ఞాపకాలు ఎలా ఏర్పడతాయి? ఈ గుట్టు విప్పే దిశగా అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా కొన్ని విషయాలను వెల్లడించారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.
- ఫారం 16 లేకున్నా ఐటీ రిటర్న్స్ దాఖలు.. గడువు పొడిగిస్తారా?
IT return last date: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు ఈ నెల 31 ఆఖరి తేదీ. కొన్నేళ్లుగా రిటర్ను దాఖలులో పలు మార్పులు వచ్చాయి. ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు పూర్తి చేసేటప్పుడు ఈ కింది జాగ్రత్తలు పాటించండి. మరోవైపు రిటర్ను దాఖలుకు గడువు పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు.
- మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో బాంబ్ బ్లాస్ట్.. పరుగులు తీసిన జనం
Bombblast In Stadium: అఫ్గానిస్థాన్.. కాబూల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ష్పగీజా క్రికెట్ లీగ్లో భాగంగా టీ20 మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ఆటగాళ్లను అధికారులు బంకర్లోకి తరలించారు. భయంతో జనం పరుగులు తీశారు.
- Kriti Shetty: 'అది తింటే.. నా మూడ్ ఇట్టే మారిపోతుంది'
Kriti Shetty: 'ఉప్పెన'తో తెలుగులో తొలి సినిమాతోనే బేబమ్మగా గుర్తింపు తెచ్చుకొని తమిళం, కన్నడలోనూ వరుస అవకాశాలను దక్కించుకుంటోంది కృతి శెట్టి. ప్రస్తుతం తెలుగులో ఈ 18ఏళ్ల అమ్మాయి నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉంది. అయితే ఆమె తన గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. అవేంటో చూద్దాం.
ప్రధాన వార్తలు @ 11 AM