ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ:జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా - కరోనాతో పది పరీక్షలు వాయిదా

.

10th exams postpone in ghmc circle highcourt ordered
తెలంగాణ:జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా

By

Published : Jun 6, 2020, 6:02 PM IST

గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పరీక్షల నిర్వహణకు అనుమతించింది. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో జాగ్రత్తలు తీసుకున్నామని.. పరీక్షలకు అనుమతివ్వాలని ఇది వరకే ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది.

కరోనాతో ఎవరైనా విద్యార్థి మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థి మరణిస్తే ఆ కుటుంబానికి ఎన్ని కోట్లు ఇస్తారు.. ఎవరు బాధ్యత తీసుకుంటారని సూటిగా ప్రశ్నించింది. పరీక్షల కన్నా విద్యార్థుల జీవితాలే ముఖ్యమన్న ధర్మాసనం... పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాలు కంటైన్​మెంట్​గా మారితే ఏం చేస్తారని అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పలేదని తెలిపింది.

జీహెచ్​ఎంసీలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా లక్షల విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేమని ధర్మాసనం తేల్చింది. ఎక్కడ కేసులు పెరిగితే అక్కడ పరీక్షలు వాయిదా వేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా పడింది.

ఇదీ చూడండి:సినీ నటుడు సూర్య తండ్రిపై పోలీసులకు తితిదే ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details