శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం.. బంగారం అక్రమ రవాణాకు పాల్పడిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన సదరు వ్యక్తి.. ప్రత్యేకంగా రూపొందించిన చెప్పుల్లో పేస్ట్ రూపంలో 672 గ్రాముల పసిడిని దాచిపెట్టాడు. తనిఖీల సమయంలో గుర్తించిన అధికారులు.. 594 గ్రాముల నికర బంగారాన్ని వెలికి తీశారు. దీని విలువ రూ.27.4 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నోట్లో దాచిపెట్టి..