ప్రతి జిల్లాలో 104 కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ ఆస్పత్రులు, కేర్ సెంటర్లు, పడకలు, అంబులెన్స్‌ల వివరాలకు 104 కాల్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. హోమ్ ఐసొలేషన్, హోమ్ క్వారంటైన్, వ్యాక్సినేషన్ కేంద్రాల వివరాల సేవలకు 104 కాల్ సెంటర్లు పనిచేయనున్నాయి. 104 కాల్ సెంటర్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించారు. 104 కాల్ సెంటర్ నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. 104కు కాల్ చేసిన వెంటనే చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
104 కాల్ సెంటర్ నిరంతరం పనిచేసేలా చర్యలు: ప్రభుత్వం - 104 call center in AP
104 కాల్ సెంటర్ నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. కాల్ సెంటర్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించారు. కొవిడ్ ఆస్పత్రులు, కేర్ సెంటర్లు, పడకలు, అంబులెన్స్‌ల వివరాలకు 104 కాల్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది.
104 కాల్ సెంటర్