ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీపై కరోనా పంజా.. 24 గంటల్లో 10,328 కేసులు నమోదు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గడంలేదు. 24 గంటల వ్యవధిలో 10,328 కేసులు నమోదయ్యాయి. 72 మంది మృతిచెందారు. 24 గంటల వ్యవధిలో 63,686 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

10,328 new corona cases reported in AP
ఏపీపై కరోనా పంజా.. 24 గంటల్లో 10,328 కేసులు నమోదు

By

Published : Aug 6, 2020, 7:27 PM IST

Updated : Aug 6, 2020, 7:45 PM IST

ఏపీపై కరోనా పంజా

రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 10,328 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 72 మంది మృతిచెందారు. మొత్తం కరోనా కేసులు 1,96,789కి చేరాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 1,753 మంది మృత్యువాతపడ్డారు. కొవిడ్ నుంచి 1,12,870 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 82,166 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 63,686 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 22.99 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు.

జిల్లా వారీగా మృతుల వివరాలు...

అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో 10 మంది చొప్పున మృతిచెందారు. గుంటూరు జిల్లాలో 9, చిత్తూరు జిల్లాలో 8 మంది మరణించారు. కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృత్యువాతపడ్డారు. విశాఖ జిల్లాలో కరోనాతో నలుగురు మృతిచెందారు. కడప, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతిచెందారు. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు.

జిల్లాల వారీగా కేసులు...

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,351 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలులో 1,285, అనంతపురంలో 1,112, గుంటూరులో 868, పశ్చిమగోదావరి జిల్లాలో 798 కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో 788, విశాఖలో 781, చిత్తూరులో 755, శ్రీకాకుళంలో 682, కడపలో 604, విజయనగరంలో 575, ప్రకాశంలో 366, కృష్ణాలో 363 కరోనా కేసులు నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించింది.

ఇదీ చదవండీ... 48 గంటల సవాలు విసిరి ఏం చేశారో చెప్పాలి: బొత్స

Last Updated : Aug 6, 2020, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details